ఎటు పోతోంది ఈ ప్రపంచం…..జీవితమంటేనే సుఖదుఃఖముల మిళితము…..కావున ,ప్రతీ మనిషికి ఆనందమయమైన సమయముతో పాటూ గడ్డుకాలం కూడా తప్పక వస్తుంది…ఎదుర్కోడానికి నానా ప్రయత్నాలు చేయాలి.సర్వవేళలా అనుకూల పరిస్థితులు ఉండవు…ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి…అంత మాత్రమున ,డీలా పడిపోయి,కృంగిపోయి,క్షణికావేశమునకు లొంగిపోతే,మనము ఇంతవరకు జీవించిన జీవితము వ్యర్ధమయినట్లే కదా….మరల తిరిగి తెచ్చుకోగలమా??మన పురాణాల నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము…అర్జునుడంతటి వాడు,యుద్ధముచెయ్యలేనని చేతులెత్తేసినప్పుడు,శ్రీకృష్ణుడు చేసిన బోధని ఒంటపట్టించుకుని,మరింత ధైర్యముతో,ఆత్మస్థైర్యముతో యుద్ధభూమిలోనికి అడుగు పెట్టాడు…ఫలితం….యుద్ధములో ఘనవిజయము…రాముడికి ఎదురైన కష్టానికి చేతకానివాడివలె వేదనతో కూర్చునిఉండి ఉంటే, లంక లో రావణుడి వద్ద బంధీగా ఉన్న సీతను తిరిగి తెచ్చుకొనేవాడా???ఈ విధముగా పరీశీలించినట్లయితే ఎన్నో ఉదాహరణలు…మనము ప్రతీరోజు చూసే చలనచిత్రములలో కూడా మంచి, చెడు రెండూ ఉంటాయి కదా!!!!…కధానాయకుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏవిధముగా వ్యూహాత్మకంగా జయించి, బయటపడ్డాడో అనేది కళ్లకుకట్టినట్లు చూపిస్తారు కదా…దాని నుంచి మనము తెలుసుకోవల్సినది ఏమిటి???ఆ క్షణము ఆనందించి,బయటకి వచ్చేయడము కాదు.అటువంటి సమస్యలే మనకి నిజ జీవితములో కూడా ఏర్పడుతాయి…అటువంటప్పుడు ఆత్మస్థైర్యముతో నిలబడి సమస్యకుఎదురు నిలిచి గట్టి సంకల్పంతో,ఓర్పుతో,పోరాడినరోజు, ఆటంకములే తోకముడిచి పారిపోతాయి.అలాకాకుండా ఆత్మవిమర్శకు లోబడి,ఆత్మవిశ్వాసము తగ్గించుకుని,క్షణికావేశమునకు లోబడిన ప్రజనమేమి ఉండదు…ఇది తెలుసుకోవల్సిన విషయము..మానవ జీవితమునకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.తలుచుకొని కృషి చేస్తే ఎంతటి అసాధ్యాన్నయినా సుసాధ్యము చేయగలడు.ఆ ఒక్క విషయముదృష్టిలో పెట్టుకుని అడుగు ముందుకు వేయాలి.
ఒక దగ్గర కాకపోతే ఒకటికి 10 సార్లు ప్రయత్నిoచిన చో ఏదో ఒక దగ్గర పరిష్కారము తప్పక దొరుకుతుంది….జ్ఞానము లేని ఇతర ప్రాణులే జీవితము కోసము నిరంతరము పోరాడుతూ ఉంటే,ప్రాణముతో పాటు జ్ఞానము కూడా ఉన్న మనకి మాత్రం ఎందుకు ఈ విపరీత ఆలోచనలు???ఆ ఆలోచనల్ని అనుకూల పరిస్థితులుగా మార్చుకుని అడుగులు వేయాలి….మనకి ఎంతో అందముగా కనిపించే సీతాకోకచిలుక ,రూపాంతరము చెంది,రెక్కలతో పైకి ఎగురుతున్నప్పుడు ఎంత కష్టపడుతుందో మనకి తెలుసు…అలా అని ఎగరడం మానేస్తే దానికి జీవితమే ఉండదు…ఈ ఒక్క ఉదాహరణ చాలు ధైర్యముగా జీవించడానికి….కావున,మన జీవితములో ,ముళ్ళదారులు ఎదురైనప్పటికి,ఓపికగా,దృఢ సంకల్పబలముతో,సానుకూల వైఖరీతోఎదిరించి,ఫలితముగాపూలబాటగా మార్చుకోవడమనేది ఖఛ్చితముగా మనచేతిలోనే ఉంది…..ఇది సత్యము….



